సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఓ కారు బావిలో పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బావిలో నుంచి కారును బయటకు తీశారు.
మృతుడు ఏపీలోని నెల్లూరు జిల్లా మెట్టు గ్రామానికి చెందిన గుంజే రమణయ్యగా గుర్తించారు. రైల్వేశాఖలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.