కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని సీతాపతి రోడ్లో రాంటెంకి ప్రణీత్(20) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు... కత్తులతో దాడిచేసి బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పట్టణంలోని తీరందాజ్ బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రాణాలకు తెగిస్తూ.. పునర్జన్మ అందిస్తూ...