ఏపీలోని అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో రెండు రోజుల కిందట ఎస్బీఐ ఏటీఏంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారులు వెల్లడించారు. విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో ప్రమాదం జరిగిందని.. ఇందులో 3 ఏటీఎం యంత్రాలు, ఫర్నిచర్, ఏసీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు.
కాలిపోయిన ఏటీఏంను.. బ్యాంకు మేనేజర్‌తో పాటు స్థానిక సీఐ సమక్షంలో కట్టర్ ద్వారా తెరవగా.. మొత్తం రూ. 27.36 లక్షల నగదు లభ్యమైనట్లు వెల్లడించారు. వీటిలో రూ.17.84 లక్షలు పాక్షికంగా, రూ.1.2 లక్షలు పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించామన్నారు. దాదాపు రూ.13.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.