ఏపీ విశాఖ జిల్లాలోని గుడ్డిగుమ్మి జలపాతంలో నిన్న గల్లంతైన ముగ్గురి మృతదేహాలను విపత్తు నిర్వహణ సిబ్బంది వెలికి తీశారు. ఆదివారం మధ్యాహ్నం 10 మంది యువకులు.. జలపాతం వద్ద సరదాగా ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరు కాలు జారి పడిపోయారు. రక్షించేందుకు ప్రయత్నించి మరో ఇద్దరు నీటిలో పడి కొట్టుకుపోయారు.
పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది నిన్న రాత్రి వరకూ గాలింపు చర్యలు చేసినప్పటికీ.. గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా కాసేపటికి మరో వ్యక్తి మృతదేహాన్ని సైతం గుర్తించారు.
ఇదీ చదవండి: వైద్యం వికటించి మహిళ మృతి