కరోనా విపత్కర పరిస్థితులలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు దాతలు తమ సహాయసహకారాలను అందిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ రమేష్... 15 మంది ఉపాధ్యాయులకు నెలరోజులకు సరిపోయే బియ్యం, నిత్యావసర సరుకులను అందించారు. మరో 150 మంది ఉపాధ్యాయులకు నిత్యావసరాలను అందిస్తామని హామీ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు.
కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ప్రైవేటు టీచర్లు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టాప్టా రాష్ట్ర అధ్యక్షుడు చందర్లాల్ చౌహన్ అన్నారు. తమను ఆదుకోవాలని పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ పెద్దలను వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. తమ పరిస్థితిని గమనించి నిత్యావసరాలను అందించిన దాతకు చందర్లాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం