ETV Bharat / city

ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన కొవిడ్‌ ఉద్ధృతి

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో వారం రోజులుగా కొవిడ్ కేసులు భారీగా నమోదు కాగా... ఆదివారం నాడు కాస్త తగ్గాయి. రోజుకు 200-300 కేసులు వచ్చేవి.. నిన్న 110 మందికి కరోనా నిర్ధరణ అయింది.

covid positive cases decrease in mahabubanagar on sunday
ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన కొవిడ్‌ ఉద్ధృతి
author img

By

Published : Aug 10, 2020, 10:52 AM IST

వారం రోజులుగా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో రోజుకు 200 నుంచి 300లకు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఆదివారం కాస్త తగ్గాయి. ఉమ్మడి జిల్లాలో ఆదివారం 110 కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 29, వనపర్తి జిల్లాలో 20, జోగులాంబ గద్వాల జిల్లాలో 18, నారాయణపేట జిల్లాలో 4 కేసులు పాజిటివ్‌ వచ్చాయి.

* నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో 8 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. తాడూరు 7, కల్వకుర్తి, కొల్లాపూరులో 5గురి చొప్పున, కరోనాకు చిక్కారు. అచ్చంపేట 4, వెల్దండ 3, బిజినేపల్లి, వంగూరులో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లిలో ఒక్కొక్కరికి కరోనా నిర్ధరణ అయింది.

* మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 13 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. జడ్చర్లలో 12 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. కోయిలకొండలో ఇద్దరు, నవాబుపేట, భూత్పూరులో ఒక్కొక్కరికి కరోనా నిర్ధరణ అయింది.

* వనపర్తి జిల్లా కేంద్రంలో 16 మందికి కరోనా సోకింది. గోపాలపేటలో ఇద్దరు, కొత్తకోట, పెబ్బేరులో ఒక్కొక్కరు ఈ వైరస్‌ బారిన పడ్డారు.

* జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు, మూడు రోజులుగా వంద కేసులు దాటిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందారు. ఆదివారం కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్‌ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో 12 మందికి, మల్దకల్‌లో నలుగురు, ఉండవల్లి, ధరూరులో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.

* నారాయణపేట జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో మక్తల్‌లోనే ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నారాయణపేట పట్టణంలో ఒకరు కొవిడ్‌ బారిన పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.