ETV Bharat / city

పెద్దాసుపత్రికి పెరిగిన తాకిడి.. పెచ్చులూడుతూ భయపెడుతున్న భవనం

Karimnagar Hospital Problems: వర్షకాలంలో సీజనల్‌ వ్యాధులతో జనం దవాఖానలకు పరుగులు పెడుతున్నారు. తాగునీరు, తినే ఆహారపదాపర్థాలు కలుషితం కావడం, దోమల వల్ల... డయేరియా, టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వారాల బారినపడుతున్నారు . భారీ వర్షాలు, వరదల తర్వాత కరీంనగర్‌ పెద్దాసుపత్రికి చికిత్స కోసం చిన్నపిల్లలు సహా పెద్దలు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు వేలాది మందికి వైద్యం అందించే ఆసుపత్రిలోని పలు వార్డుల్లో స్లాబులు... పెచ్చులూడి పడిపోవడం పరిపాటిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. శాశ్వత మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

heavy flow to karimangar government hospital and there is lake of facilities

author img

By

Published : Jul 19, 2022, 4:34 PM IST

పెద్దాసుపత్రికి పెరిగిన తాకిడి.. పెచ్చులూడుతూ భయపెడుతున్న భవనం

Karimnagar Hospital Problems: ఉత్తర తెలంగాణలో కీలకమైన ఆసుపత్రిగా ఉన్న కరీంనగర్‌ సర్కార్‌ దవాఖాన.... రోగులు, సిబ్బందికి పరీక్షగా మారింది. ఆసుపత్రిలోని ఐపీ, సర్జికల్‌, జ్వర వార్డుల్లో.. ఏటా వర్షకాలంలో పెచ్చులూడి పడిపోవటం రివాజుగా మారింది. భవనాలకు శాశ్వత మరమ్మతులు చేయకపోవడం వల్ల.. లక్షలు ఖర్చుపెట్టి చేస్తున్న పనులు ఫలితమివ్వడంలేదు. నాణ్యత లోపించడం వల్ల ఏటా భవనం పైకప్పు నుంచి నీరు కారుతోంది. రోగులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రిలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది.

వేలాది మందికి సంజీవనిలా మారిన ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆసుపత్రిలో ఉన్న పడకలు సరిపడక వరండాలో మడత మంచాలు వేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. జ్వరపీడితులు , ఇతర వ్యాధులతో వచ్చే వారితో దవాఖాన కిటకిటలాడుతోంది.

జ్వరం వచ్చినవారందరికీ కరోనా వస్తుందనే భయమేమీ లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. వర్షకాలంలో తాగునీరు, ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే డయేరియా, టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ బారినపటడం ఖాయమని హెచ్చరిస్తున్నారు . కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బయటి తిండి తినకపోవడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు . పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

"వర్షంతో పాటు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటితో పాటు కరోనా బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయినా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా, జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యం చిన్నపిల్లలు.. సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా తాగు నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి." -డా.అజయ్‌, చిన్నపిల్లల వైద్యనిపుణులు

రోగుల రద్దీ దృష్ట్యా పెద్దాసుపత్రిలో ఏర్పాట్లు చేయాలని...., ప్రమాదకరంగా మారిన వార్డుల్లో యుద్ధప్రాతిపదిన మరమ్మతులు చేయించాలని జనం కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.