సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యూఎన్ డీపీ) కితాబిచ్చింది. 2019 సంవత్సరానికి గాను సమగ్ర, సుస్థిర ఆర్థికాభివృద్ధి రంగంతో పాటు డీసెంట్ వర్క్ ఫర్ ఆల్ రంగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిందని పేర్కొంది.
16 లక్ష్యాలకు గాను ఎనిమిదో లక్ష్యమైన డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్‌లో 82 పాయింట్లు సాధించింది. పదో లక్ష్యమైన ఆర్థిక అసమానతల తగ్గింపులో 94 పాయింట్లు సాధించింది. ఈ రెండు రంగాల్లో తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అగ్రభాగాన నిలిచిందని వెల్లడించింది. మొత్తం అన్ని లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.

70 పాయింట్లతో కేరళ, 69 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా... తెలంగాణ 67 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. యూఎన్డీపీ ప్రకటనపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ పనితీరు బాగా ఉండడం సంతోషకరమని పేర్కొన్నారు.

ఇవీచూడండి: తెలంగాణ కుంభమేళాకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?