కరోనా విలయతాండవం చేస్తున్న ఈ కష్టసమయంలో చాలా మంది తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్, సభ్యులు ఒక్కొక్కరు సీఎం సహాయ నిధికి రూ.25 వేలు అందజేశారు.
రూ.1.25 లక్షలు విలువ చేసే చెక్కును ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్కు అందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు తమ వంతు సాయం చేస్తున్నామని కమిషన్ సభ్యులు తెలిపారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికులకు సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.