ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్ @5PM
టాప్​టెన్ న్యూస్ @5PM
author img

By

Published : Nov 15, 2020, 4:59 PM IST

1. ముహూర్తం ఖరారు

ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని సీఎం కేసీఆర్​ తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ఆదరణ పొందుతోందని అన్నారు. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. గుడ్ న్యూస్

కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఆర్టీసీపై రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్, ఎండీ సునీల్ శర్మ, ఈడీలతో సీఎం సమావేశమయ్యారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై సమావేశంలో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కేసీఆర్​కు ఉత్తమ్ లేఖ

సీఎం కేసీఆర్​కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్, సయిఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసుల బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ మంత్రి నియోజకవర్గంలోనే ఇప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కేంద్రం ఆదుకోవాలి..

రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తూ... రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి సూచించారు. వరి ధాన్యానికి బోనస్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడగా... కేంద్రం అడ్డుకోవటం సరికాదన్నారు. సాదాబైనామాల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకురావడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'సపుత్నిక్-వీ' ట్రయల్స్

రష్యన్​ 'స్పుత్నిక్​-వీ' రెండు, మూడు దశల క్లినికల్​ ట్రయల్స్​ ఉత్తర్​ప్రదేశ్​​లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు​ కరోనా వ్యాక్సిన్ తొలిబ్యాచ్​..​ వచ్చే వారం కాన్పుర్​లోని ఓ మెడికల్​ కాలేజీకి రానున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ప్రమాణానికి వేళాయే!

బిహార్​ ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్​ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం తన నివాసంలో జరిగిన ఎన్​డీఏ కూటమి సమావేశంలో నితీశ్​ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. సీఎంకు కొరడా దెబ్బలు!

ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అలా కొట్టించుకోవడానికి ఓ కారణం ఉంది. ఓ పూజా కార్యక్రమంలో పాల్గొని సంప్రదాయబద్దంగా ఇలా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. నిరసనలు తీవ్రరూపం

పెరూ అధ్యక్షుడు మాన్యువల్​ మెరినోకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పోలీసుల కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. శ్రేయస్ రికార్డు

దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ అరుదైన ఘనత సాధించాడు. అయితే క్రికెట్​లో కాకుండా ఇన్​స్టాగ్రామ్​లో ఈ రికార్డు నెలకొల్పాడు. సచిన్, ధోనీ వంటి భారత క్రికెట్​ దిగ్గజాలు సాధించలేని ఘనతను ఈ యువహిట్టర్ సొంతం చేసుకున్నాడు. అసలింతకీ అతడేం సాధించాడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మరో మల్టీస్టారర్..

కింగ్​ నాగార్జున, ఆయన కుమారుడు అఖిల్​ కలిసి ఓ మల్టీస్టారర్​లో నటించబోతున్నారని సమాచారం. సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.