ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till 9 PM
టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM
author img

By

Published : Jun 9, 2021, 9:00 PM IST

Updated : Jun 9, 2021, 9:26 PM IST

ఇంటర్‌ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

తగ్గిపోయాక ధరలు ఖరారు చేస్తారా..?:

వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా తగ్గిపోయాక.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా..? అని ప్రశ్నించింది. పైవేటు ఆస్పత్రులు అధికంగా వసూలు చేసిన రుసుమును బాధితులకు ఇప్పించారా అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మరికొన్ని వర్గాలను గుర్తించండి

జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ వరంగల్, ఇతర పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన వారిలో మిగిలిన వారికి రానున్న నాలుగు రోజుల్లో కొవిడ్ టీకాలు ఇవ్వాలని అధికారులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులతో బీఆర్కే భవన్​లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్​పై చర్చించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

తగ్గుతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,29,896 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,813 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్‌ విడుదల చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రంలో 19 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు

పేద ప్రజలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే లక్ష్యంతో.. ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు( Diagnostic centres) 19జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఆయా చోట్ల మంత్రులు, ముఖ్యనేతలు వైద్యపరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. రక్త, మూత్ర, గుండె, కిడ్నీ సంబంధిత జబ్బులతో పాటు... అత్యంత ఖరీదైన పరీక్షలూ... తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లతో పేదలకు చేరువ కానున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

వరి కనీస మద్దతు ధర పెంపు

కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంపునకు పచ్చజెండా ఊపింది. క్వింటా ధాన్యానికి రూ.72, కంది, మినుములకు రూ.300 మేర పెంచింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'వారికి ప్రత్యేక సెలవులు'

కరోనా కష్టకాలంలో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చేలా మోదీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు లేక ఉద్యోగులు కానీ కరోనా బారిన పడితే ప్రత్యేక సెలవులను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

రెడ్డీస్​ ల్యాబ్​​ కీలక ఒప్పందం

వ్యాక్సిన్​లు భద్రపరిచే ఫ్రీజర్లను అందించేందుకు డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్​తో ఒప్పందం చేసుకున్నట్లు హైదరాబాద్​కు చెందిన కోల్డ్​చైన్​ ఉత్పత్తుల సంస్థ రాల్​వెల్​ ప్రకటించింది. ఈ తాజా ఒప్పందంతో స్పుత్నిక్​-వి టీకాల తరలింపు, భద్రపరచడంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముందని రెడ్డీస్​ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

అమ్మాయే కారణమా?

రెజ్లర్ హత్య కేసుకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. ఇంటి అద్దె విషయంలో వచ్చిన వాగ్వాదాలు హత్యకు కారణం కాదని తెలుస్తోంది. సోను గర్ల్​ఫ్రెండ్​ వల్లే గొడవ మొదలైనట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'శ్రీదేవీ డ్రామా కంపెనీ'లో 'జంబలకిడి పంబ'

'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sridevi Drama Company) షోలో 'జంబలకిడి పంబ'ను జబర్దస్త్‌ కమెడియన్లు స్పూఫ్‌ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జూన్​13న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమోను చూసి నవ్వుకోండి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 9, 2021, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.