ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Jun 12, 2022, 1:00 PM IST

  • భుజంపై మేనకోడలి మృతదేహం.. గుండెల నిండా దుఃఖం

ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఓ వ్యక్తి తన నాలుగేళ్ల మేనకోడలి శవాన్ని భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

  • చిరుతనే పరుగులు పెట్టించిన ఎలుగుబంటి

చిరుతను చూస్తే చాలు అడవిలోని చాలా జంతువులు పారిపోతాయి. కానీ ఓ ఎలుగుబంటి మాత్రం చిరుతనే పరుగులు పెట్టించింది. ఈ ఆసక్తికర సన్నివేశం మధ్యప్రదేశ్ ఉమరియా జిల్లాలోని బాంధవ్​గఢ్​ టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్​లో జరిగింది. చిరుత పరుగెడుతుండగా.. దాని వెనుక ఎలుగుబంటి తరుముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వీడియోను విహారయాత్రకు వచ్చిన ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించాడు.

  • డివైడర్​ దాటొచ్చి కారును ఢీకొట్టిన లారీ

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న కారును.. మల్లారం స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ దాటి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

  • స్నేహితుడి ఇంట్లో యువకుడి బలవన్మరణం

వ్యాపారంలో పెట్టుబడి కోసం అప్పు అడుగుదామని తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు ఓ యువకుడు. రాత్రి భోజనం చేసి అక్కడే నిద్రపోయాడు. బారెడు పొద్దెక్కినా స్నేహితుడు ఇంకా లేవలేదేంటని గదిలోకి వెళ్లిన చూసేసరికి తన స్నేహితుడు ఫ్యాన్​కు ఉరివేసుకుని ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగింది.

  • కాలేజ్ ఫర్ సేల్

రాష్ట్రంలో జూనియర్ కళాశాలల విక్రయ దందా జోరుగా కొనసాగుతోంది. కొందరు దళారులు, ఇంటర్‌బోర్డులో కొందరు కిందిస్థాయి అధికారులు మధ్యవర్తులుగా ఈ తంతు నడిపిస్తున్నారు. చిన్నస్థాయి ప్రైవేటు జూనియర్‌ కళాశాలల విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఏటా సుమారు వందల కళాశాలలు ఇలా చేతులు మారుతున్నాయి. వాటిలో కొందరు రాష్ట్రస్థాయి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా వాటా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

  • అత్యాచార బాధితురాలిపై కెమికల్​ దాడి

దిల్లీలో ఓ అత్యాచార బాధితురాలిపై ఇంక్​తో(కెమికల్​) దాడి జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి కుమారుడిపై ఆమె అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ఆమె తన తల్లితో కలిసి వాకింగ్​ చేస్తుండగా.. ఇద్దరు దుండగులు ఆమెపై నీలిరంగు ద్రవాన్ని చల్లారు.

  • డ్రైవర్​ నిర్లక్ష్యం.. చిన్నారి తలమీదుగా దూసుకెళ్లిన కారు

పంజాబ్​లోని లుధియానాలో విషాదం చోటుచేసుకుంది. షాహీద్ కర్నైల్​ సింగ్​ నగర్​లో అక్కతో కలిసి దుకాణానికి వెళ్తున్న ఓ ఏడాదిన్నర చిన్నారి కారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఇంటి ఎదుటే ఉన్న షాప్​కు వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా కిందపడిపోయింది చిన్నారి. తనను లేపేందుకు ఆమె అక్క ప్రయత్నిస్తుండగానే.. షాప్​ ఎదుట ఉన్న కారు.. చిన్నారి తల మీదుగా వెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే చనిపోయింది.

  • కరెన్సీ నోట్లు గాల్లో ఎగరేస్తూ చిందులు

భాగ్యనగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కరెన్సీ నోట్లను గాల్లో ఎగురవేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  • టీమ్​ఇండియా ప్రతీకారానికి వరుణుడి ఆటంకం?

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టీ20లో గట్టిగా పునరాగమనం చేయాలని టీమ్​ఇండియా భావిస్తోంది. ఒడిశా కటక్​లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్​ జరగనుంది. తొలి టీ20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న భారత్​ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా?

  • టాప్​లో కోహ్లీ, ప్రియాంక

ఇటీవలే టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసరించే వారి సంఖ్య తాజాగా 200 మిలియన్లు దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అయితే, అతడి తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారత క్రీడాకారులతో పాటు టాప్‌ సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.