Supreme court verdict in bribes' case: లంచం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగులు.. తాము లంచం డిమాండ్ చేసినట్లుగా ఒప్పుకోవడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం నేరాన్ని నిర్ధరించేందుకు ఇది తప్పనిసరి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సికింద్రాబాద్‌లో వాణిజ్య పన్నుల అధికారిణిగా పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగినిపై నేరారోపణలు చేసినందుకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగిని లంచం డిమాండ్‌పై పిటిషనర్ సాక్ష్యం నమ్మదగినదిగా లేదని వెల్లడించింది.
1997-98 లో సికింద్రాబాద్‌లో వాణిజ్య పన్నుల అధికారిణిగా ప్రతివాది పనిచేస్తుండగా.. సహకార సంఘంలో సూపర్‌వైజర్‌గా పిటిషనర్ విధులు నిర్వర్తిస్తున్నారు. సొసైటీకి సంబంధించిన పన్ను రిటర్ను పత్రాలు దాఖలు చేయడానికి అధికారిణి రూ.3000 లంచం డిమాండ్ చేసినట్లుగా ఫిర్యాదుదారు ఆరోపించారు. కాగా తాను అర్థించడంతో రూ.2000కు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఫిర్యాదుదారు హైదరాబాద్‌లోని ఏసీబీని ఆశ్రయించడంతో.. ఆమె లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు నిందితురాలిని దోషిగా నిర్ధరించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించగా.. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రతివాది.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
ఇదీ చదవండి: Bandi Sanjay On CM KCR: 'తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చినవ్'