ETV Bharat / city

సినిమా టికెట్ల ధరలపై థియేటర్ల యజమానుల కీలక నిర్ణయం

లాక్​డౌన్ వల్ల ఏడు నెలలుగా తీవ్రంగా నష్టపోయామని తెలంగాణ సినిమా థియేటర్ల యజమానుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం రాయితీలిచ్చి ఆదుకుంటే తప్ప థియేటర్ల మనుగడ సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. అక్టోబర్ 15 నుంచి థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు ఏకగ్రీవంగా వెల్లడించారు.

telangana theater owners association
సినిమా టికెట్ల ధరలపై థియేటర్ల యజమానుల కీలక నిర్ణయం
author img

By

Published : Oct 3, 2020, 5:38 PM IST

తెలంగాణలో సినిమా థియేటర్ల విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని సినిమా థియేటర్ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడి, తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇప్పుడు థియేటర్లు తెరిచినా.. పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేలా ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు.

అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీట్ల సామర్థ్యంలో థియేటర్లు పునఃప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్​లోని సుదర్శన్ థియేటర్​లో తెలంగాణ సినిమా థియేటర్ యజమానులు సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షుడు విజయేందర్​రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది థియేటర్ యజమానులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అక్టోబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లను పునఃప్రారంభిస్తున్నట్లు ఏకగ్రీవంగా తెలిపారు.

విరామ సమయంపై..

సినిమా హాల్​కు వచ్చే ప్రేక్షకులు కరోనా బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు ఎవరూ టికెట్లు తాకకుండా, విరామ సమయంలో గూమిగూడకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే విరామ సమయం లేకుండానే సినిమాను ప్రదర్శించేలా చూస్తామని, సమయాన్ని పొడిగిస్తామని స్పష్టం చేశారు.

ప్రేక్షకులు వస్తారా..?

థియేటర్లు ప్రారంభించినా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారనే నమ్మకం లేదని, అందువల్ల ఒక సినిమాను ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అలాగే ఇటీవల ఓటీటీలో విడుదలైన సినిమాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శిస్తామని తెలిపారు. నవంబర్, డిసెంబర్​లో ప్రేక్షకుల సంఖ్య తగ్గినా జనవరి నుంచి మళ్లీ థియేటర్లకు పూర్వవైభవం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

టికెట్​ ధరలపై..

సినిమా ప్రదర్శనల విషయంలో ప్రభుత్వం రాయితీలు ఇచ్చినా.. ఇవ్వకున్నా టికెట్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. పాత ధరలకే ప్రేక్షకులు సినిమా చూడొచ్చని థియేటర్ల యజమానులు వెల్లడించారు.

సినిమా టికెట్ల ధరలపై థియేటర్ల యజమానుల కీలక నిర్ణయం

ఇవీచూడండి: 'ఈ నెల 15న థియేటర్లు తెరిచినా సమస్యలెన్నో'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.