ETV Bharat / city

ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వరకు వేసవి సెలవులు

holidays for schools
ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వరకు వేసవి సెలవులు
author img

By

Published : Apr 25, 2021, 1:56 PM IST

Updated : Apr 25, 2021, 3:03 PM IST

13:54 April 25

పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​, సీఎస్​, విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు.  

కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. 

పాఠశాలలు, జూనియర్ కళాశాలలను... ఎప్పుడు తెరిచేది కొవిడ్-19 పరిస్థితిని అనుసరించి జూన్​ 1న  ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే గుంజీలు తీయాల్సిందే!

Last Updated : Apr 25, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.