కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం ఒక తెలంగాణకే పరిమితం కాలేదని కర్ణాటక, గోవాలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు హస్తం నేతలు ఎన్ని హామీలిచ్చినా, ఏం చెప్పినా ప్రజలు నమ్మలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పట్టు కోల్పోతోందని, ప్రజలను ఆకర్షించడంలో విఫలమవుతోందన్నారు. అందుకే హస్తం నేతలు ఇతర రాష్ట్రాల్లో, అధికార పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. నిబంధనల ప్రకారమే 12 మంది ఎమ్మెల్యేల విలీనం జరిగిందని స్పష్టం చేశారు.
దేశమంతా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంది..! - శాసనసభ-2019
నిబంధనల ప్రకారమే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేయడం జరిగిందని, ఒకటింట మూడోవంతు సభ్యులు విలీన లేఖ ఇచ్చిన తర్వాత అది చట్టవిరుద్ధం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.