ETV Bharat / city

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా - ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా

భారతీయ స్టేట్​ బ్యాంకు ఖాతాదారులందరికీ హైదరాబాద్​ స్టేట్​ బ్యాంకు చీఫ్​ జనరల్​ మేనేజర్​ ఓపీ మిశ్రా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్​ ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

sbi cgm flag hosting in hyderabad
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా
author img

By

Published : Aug 16, 2020, 12:23 PM IST

భారతీయ స్టేట్ బ్యాంకు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ ఆవరణలో ఆ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో బ్యాంకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తమమైన ర్యాంకులు సాధించిన సాత్విక, తేజస్​లను సీజీఎం ఓపీ మిశ్రా అభినందించారు. ప్రతి ఒక్క ఉద్యోగి పూర్తి విశ్వాసంత... క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి నవ భారత నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.

భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులందరికీ సీజీఎం ఓపీ మిశ్రా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంకు సామాజిక బాధ్యతతో మెడికల్ పరికరాలు, వెంటిలేటర్లు, వైద్యులకు పీపీఈ కిట్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. గాల్వాన్ వ్యాలీలో చైనా బలగాలతో పోరాడి వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను కొనియాడారు. భారత్ సైనికులపై దాడి చేసిన దేశాలకు చెందిన ఉత్పత్తులను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా

ఇవీ చూడండి: పిల్లలపై కరోనా పంజా.. యువత బయట తిరగడమే కారణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.