దిల్లీకి చెందిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం వైద్యుల బృందం హైదరాబాద్ చేరుకుంది. దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుదీర్ గుప్తా ఆధ్వర్యంలో ఆదర్శ కుమార్, అభిషేక్ కుమార్, వరుణ్‌చంద్రతో కూడిన వైద్యుల బృందం ఇవాళ ఉదయం గాంధీ మార్చురీలో మృతదేహాలకు రీపోస్టుమార్టం చేస్తారు.
ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు. సాయంత్రం వరకు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఒక్కో మృతదేహానికి రెండు గంటల పాటు రీపోస్టుమార్టం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం మృత దేహాలను బంధువులకు అప్పగించనున్నారు.
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు