సికింద్రాబాద్ అడ్డగుట్ట కమ్యూనిటీ హాలులో పోషక అభియాన్ మాసం సంబురాలు ఘనంగా నిర్వహించారు. 70 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్న ప్రాసన, అంగన్ వాడి టీచర్లు క్యాట్ వాక్, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా పోషక వంటకాలు ఆకు కూరలతో వంటకాలు చేయించి పోషక విలువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్త్రీ, శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి, సికింద్రాబాద్ సీడీపీఓ అధికారి సునందలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభ్యుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గర్భిణీలు అంగన్వాడీ సెంటర్లోనే భోజనం చేయాలని కోరారు.
అడ్డగుట్టలో పోషక అభియాన్ మాసం సంబురాలు
మహానగరంలో పోషక అభియాన్ మాసం సంబురాలు ఘనంగా నిర్వహించారు. సికింద్రబాద్ అడ్డగుట్ట కమ్యూనిటీ హాలులో 70 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్న ప్రాసన నిర్వహించారు.