మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీతక్క కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వచ్చే నెల 5న ప్రారంభంకానున్న వనదేవతల జాతరకు హాజరు కావాలని కోరారు. ఆసియాలో అతిపెద్దదైన గిరిజన జాతర, ప్రత్యేకతలు, విశిష్టత గురించి గవర్నర్‌కు సీతక్క వివరించారు.
ఇవీ చూడండి: 'సచివాలయ నిర్మాణ, అంచనా వ్యయం వివరాలు ఇవ్వండి'