మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ పార్లమెంటు సమావేశంలో తెలుగులో మాట్లాడారు. లోక్‌సభలో ఓబీసీ బిల్లుపై చర్చ సందర్బంలో ప్యానల్ స్పీకర్‌గా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. నవనీత్ కౌర్ మాట్లాడుతుండగా సమయం అయిపోయిందనీ.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలని ముగించాలని సూచించారు. అయితే.. అప్పుడు నవనీత్ కౌర్.. మీరు తెలుగు వాళ్లే మేమూ తెలుగు వాళ్లమే మాట్లాడేందుకు కాస్త సమయం ఇవ్వండని తెలుగులో కోరారు. ఆ తర్వాత ఆమె ఓబీసీ బిల్లుపై మాట్లాడారు.
ఇదీ చదవండి: KRMB: కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ