ETV Bharat / city

ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్​హోళ్లు తీయొద్దు: దానకిషోర్

author img

By

Published : Oct 19, 2020, 6:40 PM IST

ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను జలమండలి ఎండీ దానకిషోర్​ పరిశీలించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్​ హోల్ మూతలు తీయవద్దని, ఎక్కడైనా ధ్వంసమైనా, తెరిచిన సమాచారం ఇవ్వాలని కోరారు.

jalmandali md dana kishore inspection sanitation works in flood effected areas
ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్​హోళ్లు తీయవద్దు: దానకిషోర్

హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్ హోల్ మూతలను తెరవకూడదని జలమండలి ఎండీ దానకిషోర్ కోరారు. వెస్ట్ మారేడ్​పల్లి, బ్రాహ్మణవాడి, బేగంపేట, మయూర్ మార్గ్, ప్రకాష్​నగర్ ప్రాంతాల్లో ప‌ర్యంటించి... ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఎక్కడైనా మ్యాన్​ హోల్ మూతలు ధ్వంసమైనా, తెరిచి ఉంచినా... 155313 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

మురుగు ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైను శుభ్రం చేయ‌గా వ‌చ్చే వ్యర్ధాల‌ను వెంట‌నే అక్కడి నుంచి తొల‌గించి, పారిశుద్ధ్య పనులు చేపట్టిన వెంటనే సోడియం హైపోక్లోరైట్ రసాయనం చల్లించాలని సూచించారు.

ఇదీ చూడండి: ముంపునకు గురైన ప్రజలకు మంచినీరు సరఫరా చేయాలి: దానకిషోర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.