కరోనా తీవ్రత పెరుగుతున్నందున విద్యా సంస్థలు మూసివేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను జూనియర్ కళాశాలలు కచ్చితంగా పాటించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇంటర్ కాలేజీలన్నీ మూసి వేయాలని ఆయన ఆదేశించారు.
ఉత్తర్వులు అమలు చేయని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి హెచ్చరించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు మాత్రం ఆన్లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించారు.