ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35వేల 922 పరీక్షల ఫలితాలు రాగా.. 6వేల 582 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 9లక్షల 62వేల 37కు పెరిగింది. వైరస్ బారినపడి కొత్తగా 22 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 7వేల 410కి చేరింది.
24 గంటల్లో కొవిడ్ నుంచి 2వేల 343 మంది కోలుకోగా...ఇప్పటివరకూ 9లక్షల 9వేల 941 మంది వ్యాధిని జయించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 44వేల 686 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: కొవిడ్ నిబంధనలు గాలికొదిలేస్తున్న వ్యాపారులు, ప్రజలు