రాష్ట్రంలో ఇవాళ, ఎల్లుండి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో... రేపు వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తున ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.