ETV Bharat / city

ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్నివిధాలా సమర్థుడు: గుత్తా

సీఎం పదవిపై తెరాసలో ఏం చర్చ జరుగుతోందో కేటీఆర్‌కు తెలియదని.. సీఎం పదవికి అన్ని విధాలా కేటీఆర్ సరైన వ్యక్తి అని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమని తనను ఎవరూ అడగలేదని.. ఏ అవకాశాన్నయినా సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. ఈ మేరకు మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో గుత్తా ప్రసంగించారు.

gutha-sukhender-reddy-on-ktr-and-nagarjun-sagar-election
ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్నివిధాలా సమర్థుడు: గుత్తా
author img

By

Published : Jan 2, 2021, 1:35 PM IST

Updated : Jan 2, 2021, 2:02 PM IST

కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా సమర్థుడని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి అభిప్రాయపడ్డారు. పట్టుదల, పాలనా దక్షత, వివిధ భాషలపై పట్టు కేటీఆర్​కు ఉన్నాయన్నారు. అయితే కేటీఆర్ సీఎం అవుతారో లేదో దానిపై పార్టీలో ఏం చర్చ జరుగుతుందో తనకు తెలియదన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమని తనను ఎవరూ అడగలేదని.. అడిగినప్పుడు ఆలోచిస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏకగ్రీవం అయితే బాగుంటుందని.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కాలంగా ఆ పద్ధతి కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్​గా సంతృప్తిగా ఉన్నానని.. పంచాయతీ స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన తాను ఏ అవకాశాన్నయినా సద్వినియోగం చేసుకుంటానని స్పష్టం చేశారు.

ఇటీవల రాజకీయ నేతలు మాట్లాడుతున్న పదజాలం సరైంది కాదని.. అది భవిష్య రాజకీయాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. రాజకీయాలపై ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడుతుందని గుత్తా అన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు తాను మొదటి నుంచి వ్యతిరేకమేనని.. ఆ విషయంలో రాజీ పడేది లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఒకటి రెండు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన బలపడినట్లు కాదన్నారు. ఏ ఎన్నికల్లోనైనా గెలుపు ఓటములు ఆ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో కొవిడ్​ టీకా డ్రై రన్​

Last Updated : Jan 2, 2021, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.