ETV Bharat / city

Fuel Prices: మండుతోన్న ఇంధన ధరలు.. వారం వ్యవధిలో రూ.4 పైగా భారం

author img

By

Published : Mar 29, 2022, 11:47 AM IST

Fuel Prices: మండుతోన్న ఇంధన ధరలు.. వారం వ్యవధిలో రూ.4 పైగా భారం
Fuel Prices: మండుతోన్న ఇంధన ధరలు.. వారం వ్యవధిలో రూ.4 పైగా భారం

11:32 March 29

దేశంలో చమురు ధరల మంట మండిపోతోంది. మంగళవారం మరోసారి ఇంధన సంస్థలు ధరలను సవరించాయి. ఫలితంగా గత 8 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 7 సార్లు పెరిగాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌పై 70 పైసలు పెరిగింది. ఈ పెంపుతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్ రూ.100 దాటింది. అంతకుముందు అది రూ.99.41 పలికింది. ముంబయిలో వినియోగదారులు లీటర్ పెట్రోల్ కొనాలంటే రూ.115 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.113.61గా ఉంది. ఇలా కొద్ది రోజులుగా పెరుగుతోన్న రేట్లతో వారం వ్యవధిలో ప్రజలపై రూ.4 పైగా భారం పడింది.

ప్రధాన నగరాల్లో చమురు ధరలు..

దిల్లీ: పెట్రోల్‌ రూ.100.21, డీజిల్‌ రూ.91.47

ముంబయి: పెట్రోల్ రూ.115.04, డీజిల్‌ రూ.99.25

చెన్నై: పెట్రోల్‌ రూ.105.94, డీజిల్‌ రూ.96

కోల్‌కతా: పెట్రోల్‌ రూ.109.68, డీజిల్ రూ.94.62

హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.113.61, డీజిల్ రూ.99.84

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ.. గత నవంబర్‌ నుంచి నాలుగు నెలల పాటు దేశీయ సంస్థలు చమురు ధరలు సవరించలేదు. దాంతో వాటికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ వరుస పెంపుతో ఆ నష్టాల భారం ఇప్పుడు ప్రజలపై పడుతోంది.

ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎనిమిది రోజుల్లో ఏడోసారి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.