ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @ 3PM

author img

By

Published : Aug 1, 2020, 2:57 PM IST

Updated : Aug 1, 2020, 3:23 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @ 3PM

5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 5న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. నియంత్రిత విధానంలో సాగు, కరోనా పరిస్థితి, నివారణ చర్యలు సహా కరోనా నేపథ్యంలో విద్యారంగానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

11 కి చేరిన హిందుస్థాన్‌ షిప్‌ యార్డు మృతులు

ఏపీ విశాఖలోని హిందుస్థాన్ షిప్​ యార్డులో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

డీజిల్​ను పెళ్లాడిన పెట్రోల్​

కేరళ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ల కల్యాణం వైభవంగా జరిగింది. పెళ్లి పెద్దగా గ్యాస్ సిలిండర్ నిలబడింది. అదేంటి ఇంధనాలకు పెళ్లేంటి అనుకుంటున్నారా? అయితే, పూర్తి కథనం చదివేయాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

పార్టీ వందేళ్లు ఉంటుంది..!

కార్యకర్తల శ్రమ, త్యాగాలతో... తెరాస ఇంకో వందేళ్లు బలంగా ఉంటుందని రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. కార్యకర్తల బీమా కోసం బీమా కంపెనీలకు తెలంగాణ భవన్​లో​ కంపెనీ ప్రతినిధులకు చెక్కులు అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

దేశ రాజధానిలో తగ్గిన కరోనా

దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. దేశంలో కొవిడ్​ కేసుల డబ్లింగ్​ రేటు 21 రోజులు కాగా.. దిల్లీలో 50 రోజులకు పెరిగింది. యాక్టివ్​ కేసుల విషయంలోనూ 12వ స్థానానికి చేరిందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్​ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుంది

వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని విశ్వసిస్తున్నట్లు అమెరికా వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. 2021లో ప్రతీ అమెరికన్​కు టీకా లభ్యమవుతుందని తెలిపారు. ఒకేసారి పెద్ద ఎత్తున సరఫరాపై అతిగా దృష్టిపెట్టకుండా.. టీకా అవసరమున్న వారికి ముందుగా అందించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

బీచ్​లకు పోటెత్తిన ప్రజలు

బ్రిటన్​లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరంలోనే అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం నమోదైంది. లండన్ పశ్చిమాన ఉన్న హీట్​త్రో ఎయిర్​పోర్ట్​ వద్ద 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. వేడి వాతావరణం నేపథ్యంలో బ్రిటన్ ప్రజలు బీచ్​లకు పోటెత్తారు. పెద్ద ఎత్తున సముద్రతీరాలకు తరలివెళ్లారు. దీంతో ప్రఖ్యాత బీచ్​లన్నీ కళకళలాడాయి. కొన్ని ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించలేదు. జనాభా అధికంగా ఉంది కాబట్టి వ్యక్తిగత దూరం సాధ్యం కాదని, బీచ్​లకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

పాండ్య వారసుడిని చూశారా?

శుక్రవారం తండ్రి అయిన టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య.. తన వారసుడి తొలి ఫొటోనూ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ చిత్రానికి కామెంట్లు పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

భావోద్వేగభరితంగా గుంజన్ సక్సేనా

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

సోనూకే సాయం చేస్తాం

లాక్​డౌన్​ వేళ వేలాది మందికి అండగా నిలుస్తున్న సోనూసూద్​ ఔదార్యానికి ఇద్దరు చిన్నారుల మనసు కరిగిపోయింది. అంతే, వెంటనే ఎప్పటి నుంచో పిగ్గీ బ్యాంక్​లో దాచుకున్న డబ్బును.. సోనూకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Last Updated : Aug 1, 2020, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.