1. 'యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది'
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని పున:ప్రారంభం కోసం తుదిమెరుగులు దిద్దే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్యూలైన్ల నిర్మాణాన్ని వచ్చే నెల 15వతేదీ కల్లా పూర్తి చేయాలని గడువు విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ఉద్యమ స్ఫూర్తితోనే సాకారం'
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణను సాకారం చేసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వేదికగా రాష్ట్రంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలకు సీఎం అంకుర్పారణ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పోలింగ్‌కు ఏర్పాట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మొబైల్ నెట్వర్క్ మోసం
మొబైల్ నెట్వర్క్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇతర నెట్వర్క్ సంస్థల పేరిట మీ ప్లాన్ గడువు ముగుస్తుందని ఫోన్ చేస్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఉత్తరాఖండ్ సీఎం కేబినెట్
ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్. గవర్నర్ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్
బంగాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న 30 మంది ప్రముఖుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో అధ్యక్షురాలు సోనియా సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. సీట్ల లెక్కలు ఫైనల్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును ఆగమేఘాలపై పూర్తి చేసుకున్నాయి ప్రధాన పార్టీలు. పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. తీవ్రంగా స్పందించిన చైనా
దేశాల మధ్య సమావేశాలు మూడో పక్షానికి నష్టం చేకూర్చరాదని అన్నారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియన్. పరస్పర సహకారం, సంబంధాల బలోపేతం కోసమే వాటిని నిర్వహించాలని క్వాడ్ సదస్సును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. భారత్ బ్యాటింగ్
అహ్మదాబాద్ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. హీరోయిన్ నిశ్చితార్థం
జైపుర్‌లోని ఓ కోటలో హీరోయిన్ మెహరీన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.