ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM

author img

By

Published : Feb 27, 2021, 6:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

1. నేతలతో కేటీఆర్ భేటీ... ఎమ్మెల్సీ వ్యూహంపై చర్చ

తెలంగాణ భవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సవాల్​: ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామా చేస్తాం

భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిస్తే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని మంత్రులు ప్రశాంత్​ రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​ భాజపా నేతలు సవాల్​ విసిరారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో తరహా అభివృద్ధి లేదని వారు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'కేటీఆర్ సహాయం మర్చిపోలేం'

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి కేటీఆర్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మేడారంలో కరోనా పాజిటివ్​

మేడారం చినజాతరలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి అప్పయ్య పేర్కొన్నారు. మేడారంలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. మేడారం చినజాతర నేటితో ముగియనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'కేసులు పెరుగుతున్నాయ్​'

రాష్ట్రాలు కొవిడ్​ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలను చేపట్టాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ప్రతి పౌరుడికీ న్యాయవ్యవస్థను చేరువ చేయాలి'

ప్రజాస్వామ్యం మరింత వేళ్లూనుకునేలా చేసేందుకు న్యాయ శాస్త్ర విద్యార్థులకు ప్రత్యేక అవకాశం ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తమిళనాడు డా.అంబేద్కర్​ లా విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'మోదీ భయపడుతున్నారు'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనాను చూసి భయపడుతున్నట్లు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. భారత్​-చైనా సరిహద్దు వివాదంపై మాట్లాడిన రాహుల్​.. ప్రధాని అసమర్థత కారణంగానే భారత్​ భూభాగంలోకి డ్రాగన్ వచ్చిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. పరిష్కారానికి సిద్ధం: ఇమ్రాన్

నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొల్పే దిశగా భారత్-పాక్ తీసుకున్న నిర్ణయాన్ని పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. భారత్-పాక్ నిర్ణయం నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద నిరోధక చర్యలు ఆగవని ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. చివరి టెస్టు పిచ్​!

మొతేరా పిచ్​పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తదుపరి మ్యాచ్​కు బ్యాటింగ్​కు అనుకూలించేలా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్​ జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ.. ఐసీసీ దృష్టిలో పడకుండా.. బీసీసీఐ ఈ మార్పులు చేయొచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అనసూయ మాస్ గీతం!

అనసూయ నర్తించిన స్పెషల్ సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె స్టెప్పులు అభిమానుల్ని అలరిస్తూ గీతంపై ఆసక్తి పెంచుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.