ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jun 6, 2021, 8:55 PM IST

Updated : Jun 6, 2021, 10:03 PM IST

కట్టడి మథనం

ఈనెల 8 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet)జరగనుంది. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో ఈనెల 9 తేదీ వరకు లాక్​డౌన్ (LOCKDOWN)విధించారు. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్​డౌన్​ను పొడిగించాలా... రాత్రి కర్ఫ్యూ పెట్టాలా అనే అంశంపై క్లారిటీ రానుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

తగ్గుతున్న తీవ్రత

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శనివారం సాయంత్రం ఐదున్నర నుంచి ఈ సాయంత్రం ఐదున్నర గంటల వరకూ.. 97,751 పరీక్షల ఫలితాలు రాగా.. 1,436 పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా బారిన పడి మరో 14 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో భారీగా మత్తుపదార్థాలను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఉగాండా, జాంబియాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణీకుల నుంచి రూ.78 కోట్లు విలువైన 12 కిలోలు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

పెట్రో బాదుడు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకు 10, 20 పైస‌ల చొప్పున పెరుగుతూ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ.100కు చేరువవుతోంది. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే సెంచ‌రీ దాటేసింది. ఈ ఇంధ‌న ధ‌ర‌ల‌కు ఆదివారం కూడా బ్రేక్ ప‌డ‌కపోగా.. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

పిల్లలపై ట్రయల్స్​ షురూ..

చిన్న పిల్లలపై కరోనా మూడో దశ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగు పడింది. 18 ఏళ్లలోపు వారిపై భారత్ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్(Covaxin)​ క్లినికల్​ ట్రయల్స్​​ ఆదివారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సాగుకు ఢోకా లేదు..

కొవిడ్​ రెండో దశ వ్యాప్తి భారత వ్యవసాయ రంగంపై ఏ విధంగానూ ప్రభావం చూపదని తెలిపింది నీతి ఆయోగ్​. మే నెలలో పల్లెలకూ వైరస్​ వ్యాప్తి చెందినప్పటికీ.. ఆ సమయంలో వ్యవసాయ పనులు చాలా తక్కువని పేర్కొంది. మార్కెట్లు సాధారణంగానే పని చేశాయని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కొత్తరకం వ్యాధి

కొవిడ్​ మహమ్మారి నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా రెండో దశలో ఈ కేసులు బయటపడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ముంబయిలో 25 మంది గ్యాంగ్రీన్​తో బాధపడుతున్నట్లు తెలిసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

చైనా మూల్యం చెల్లించాల్సిందే

కరోనా వైరస్​ చైనాలోని వుహాన్​లోనే పుట్టిందన్న పరిశోధనల నేపథ్యంలో ఆ దేశంపై విరుచుకుపడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైరస్​ కారణంగా ప్రపంచానికి జరిగిన నష్టానికి డ్రాగన్​ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

గాయంతో ఫెదరర్​ ఔట్​!

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్​ ఫెదరర్​ ఫ్రెంచ్​ ఓపెన్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరో సారి మోకాలి గాయం తిరగబెట్టడం వల్ల టోర్నీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్​కు అర్హత సాధించాడు ఫెదరర్. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

షూటింగ్​లకు అనుమతి

సినిమా/టీవీ షూటింగ్​లకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం(జూన్ 7) నుంచి చిత్రీకరణలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 6, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.