19 ఏళ్ల బంధానికి బై
తెరాసతో ఉన్న 19 ఏళ్ల అనుబంధాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendhar) తెంచుకున్నారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టంచేశారు. తెరాస సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల ప్రకటించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు ఆదేశించినా రాజీనామా చేశానని.... తనకు పదవులు త్రుణప్రాయమన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఓనర్లమని క్లీనర్‌గా మారారు..
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. భాజపాలో చేరికపై స్పందించిన మంత్రులు... ఈటలకు ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ఓనర్లమని చెప్పి దిల్లీకి వెళ్లి క్లీనర్లుగా మారారని ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇం'ధనం' వంద
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే చమురు సంస్థలు మరోసారి పెట్రోల్ ధరలను పెంచాయి. ఫలితంగా రాష్ట్రంలోని 5 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలు దాటింది. అసలే కరోనాతో కుదేలైన వేళ.. అదనపు భారం మోపడం దారుణమని.. సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'పర్యావరణాన్ని రక్షించుకోవాలి'
జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. భూగోళంపై తలెత్తే సమస్యలను పరిష్కరించుకొనే దిశగా ప్రకృతిని తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కుంటుందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆయుధ సంపత్తి
నౌకాదళం కోసం దేశీయంగా ఆరు శక్తిమంతమైన జలాంతర్గాముల నిర్మాణం చేపట్టే మెగా ప్రాజెక్టుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.43వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రెండో దశ విజృంభణకు కారణమిదే..
భారత్‌లో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రమవడానికి కారణం.. డెల్టా వేరియంట్ అని ప్రభుత్య అధ్యయనంలో తెలిసింది. ఈ వేరియంట్ బ్రిటన్‌లోని ఆల్ఫా వేరియంట్ కన్నా ప్రమాదకరమని నిపుణులు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
యథాతథంగా కీలక వడ్డీరేట్లు
రెపో, రివర్స్ రెపో రేట్లను వరుసగా ఆరోసారి స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో వృద్ధికి ఊతమందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సెన్సెక్స్ డౌన్
స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్‌ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ స్వల్పంగా 20 పాయింట్లు నష్టపోయింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
స్థిరంగా మిల్కా సింగ్ ఆరోగ్యం
భారత మాజీ అథ్లెటిక్ మిల్కా సింగ్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్య బృందం తెలిపింది. రెండు వారాల క్రితం కొవిడ్ బారిన పడిన ఆయనను ప్రస్తుతం చంఢీగడ్‌లోని 'పీజీఐఎమ్ఈఆర్'లో ఉన్నారు. ముగ్గురు సభ్యుల వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
స్టార్ దర్శకుడితో హీరోయిన్ యామీ పెళ్లి
తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దర్శకుడు ఆదిత్య ధర్‌తో శుక్రవారం ఏడడుగులు వేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">