క'న్నీటి'పాలు
వానకాలం సాగుకు సంతోషంగా సన్నద్ధం కావాల్సిన రైతులు... కష్టాల్లో మునిగిపోయారు. ఎండకాలంలో పండించిన ధాన్యం.. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు.. అన్నదాతను నిండా ముంచాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. చెరువుల్లా మారాయి. నెల నుంచి నిరీక్షించినా... ధాన్యం కొనలేదని.. చివరకు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కరోనా కేసులు తగ్గాయి'
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ కొత్తగా 2,261 కరోనా కేసులు నమోదయ్యాయని, కొవిడ్‌తో మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మహమ్మారి బారి నుంచి మరో 3,043 మంది బాధితులు కోలుకున్నారన్న ఆయన.. పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్లపై లాక్డౌన్ ప్రభావం
లాక్డౌన్ ప్రభావం నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ బయట పడలేకపోతోంది. లాక్డౌన్ సడలింపు గడువు పొడిగించడం వల్ల మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయినా... ఆశించిన స్థాయిలో క్రయవిక్రయదారుల నుంచి స్పందన లేదు. కరోనా ప్రభావంతో బయటికి వచ్చేందుకు జనం భయపడుతున్నారు. మూడు రోజులకు గానూ కేవలం 2,727 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'వైద్యులు దేవుడితో సమానం'
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో... 30 మెడికల్ మొబైల్ యూనిట్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన 'ది లార్డ్స్ చర్చి' బృందాన్ని కేటీఆర్ అభినందించారు. కొవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం మరోసారి అందరికీ తెలిసిందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వర్ష సూచన
కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని... వాటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు నమోదైనట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కేరళకు రుతుపవనాలు
రెండు రోజులు ఆలస్యంగా కేరళకు నైరుతి రుతుపవనాలు చేరాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రుతుపవనాల రాకతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
టోక్యో ఒలింపిక్స్‌పై ప్రధాని సమీక్ష
టోక్యోలో ఒలింపిక్స్‌లో పాల్గొనే దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. దిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో.. భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆవిష్కరించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
చోక్సీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ(Mehul Choksi) వేసిన బెయిల్ పిటిషన్‌ను డొమినికా మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. పై కోర్టుకు వెళతామని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. చోక్సీ(Mehul Choksi).. చక్రాల కుర్చీలో కోర్టు ముందు హాజరయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్లో సెన్సెక్స్ (Sensex Today) 383 పాయింట్లు పెరిగి.. 52,200 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty Today) 114 పాయింట్లు బలపడి.. 15,700లకు చేరువైంది. ఆర్థిక, లోహ రంగాలు లాభాలకు దన్నుగా నిలిచాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మహేశ్ ప్లాన్..
త్వరలో షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న హీరో మహేశ్‌బాబు.. తన కొత్త సినిమా బృందం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ వేయించే ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.