ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jun 2, 2021, 8:58 PM IST

సర్వేకు సిద్ధం

రాష్ట్రంలో వ్యవసాయ భూముల డిజిటల్‌ సర్వే చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. డిజిటల్‌ సర్వే ఏజెన్సీలతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సర్వే విధివిధానాలపై ఏజెన్సీలతో చర్చించారు. ఇంచు కూడా తేడా రాకుండా సాంకేతికత వాడాలని సీఎం ఆదేశించారు. జూన్‌ 11 నుంచి పైలట్‌ విధానంలో డిజిటల్‌ సర్వే నిర్వహించనున్నారు. తొలుత 27 గ్రామాల్లో పైలట్‌ విధానంలో ఈ సర్వే చేపట్టనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కరోనా విజృంభణ

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇవాళ కొత్తగా 2,384 కరోనా కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

చికిత్సల ధరలపై హైకోర్టు అసంతృప్తి

రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై కొత్త జీవో జారీ చేయకపోవడం కోర్టు ధిక్కరణేనని వ్యాఖ్యానించింది. జీవో ఇవ్వకపోతే ఈనెల 10న వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరై... వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చికిత్సలు రద్దు చేయడం కన్నా.. బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించేలా చర్యలు ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'రుతు'పవనాలు

కేరళను గురువారం నైరుతి పవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పరిస్థితులు వర్షాలకు అనుగుణంగా ఉన్నాయని.. ఈ క్రమంలోనే నైరుతి పవనాలు కూడా కేరళ చేరతాయని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

విదేశీ టీకాల రాకకు లైన్​క్లియర్​!

దేశంలో వ్యాక్సిన్​ కొరత ఏర్పడ్డ క్రమంలో.. విదేశీ టీకాలకు(Corona Vaccine) అనుమతి ప్రక్రియల్లో డీసీజీఐ మార్పులు చేసింది. డబ్ల్యూహెచ్​ఓ ఆమోదించిన కొవిడ్​-19 టీకాలు భారత్‌లో బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

యూపీ భాజపాలో లుకలుకలు

యూపీ భాజపాలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు సంపుర్ణ మద్దతు ప్రకటించింది పార్టీ అధిష్ఠానం. నేతల అభిప్రాయాలను పార్టీ స్వీకరిస్తుందని, అయితే ఈ విభేదాలు ప్రజల్లో పార్టీ ఇమేజ్​ను దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది. యోగి సర్కారు విజయాలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నేతలకు సూచించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

గంటకు 165 మంది బలి!

మే నెలలో దేశంలో కరోనా మహమ్మారి మృత్యు తాండవం చేసింది. గంటకు సగటున 165 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా వేల మందిని బలి తీసుకుంది. ఒక్క మే నెలలోనే 90 లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదవ్వగా లక్షా 20 వేల మందికిపైగా కన్నుమూశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

మిశ్రమ ఫలితాలతో ముగిసిన సూచీలు

మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన వేళ.. స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్ 85 పాయింట్లు కోల్పోయి.. 51,849 పాయింట్ల వద్ద ముగిసింది. కేవలం 1 పాయింట్​ లాభపడిన నిఫ్టీ.. 15,576 వద్ద స్థిరపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఐసీసీ ర్యాంకింగ్స్​

ఐసీసీ ర్యాంకింగ్స్​లో(ICC Rankings) టీమ్​ఇండియా క్రికెటర్లు తమ స్థానాల్ని పదిలపరుచుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2,3లో కొసాగుతుండగా.. బౌలర్లలో బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

హీరో నిఖిల్​ కారుకు చలానా

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలను అతిక్రమించి రోడ్డుపైకి వచ్చిన హీరో నిఖిల్‌ కారుకు కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. నంబర్ ప్లేటు కూడా సరిగా లేకపోవడంతో మరో చలానా విధించి పంపించివేశారు. అయితే ఆ సమయంలో హీరో కారులో లేడని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ ఫోన్‌తో హీరో నిఖిల్‌తో పోలీసులు మాట్లాడారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.