కడుపున పుట్టకున్నా.. చనుబాలిస్తున్న అమ్మలు - ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్
ఏ బిడ్డ ఆకలితో అల్లాడినా.. నిజమైన తల్లి మనసు అల్లాడిపోతుంది. అందులోనూ అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే ఏ తల్లి హృదయమైనా కదిలిపోతుంది. కల్మషం లేని మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. ఇప్పుడు ఆధునిక సాంకేతికత ఇలాంటి మాతృహృదయాలకు మరింత సాయపడుతోంది. పాలు మిగిలిపోయే బాలింతలు, బిడ్డలు దూరమైన తల్లులు చనుబాలను దానం చేస్తున్నారు.
mothers feeding
By
Published : Mar 26, 2021, 7:08 AM IST
పుట్టగానే అనాథలుగా మారి సంరక్షణ కేంద్రంలో ఉన్న పసికందులు, వివిధ కారణాల వల్ల తల్లికి దూరంగా ఉంచే బిడ్డల ఆకలి తీర్చుతోంది ‘ధాత్రి’ మిల్క్ బ్యాంక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 మంది వరకూ బాలింతలు చిన్నారుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారని నిలోఫర్‌లోని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో మూడు నెలల పాటు పాల సేకరణ వీలు పడకపోయినా.. అంతకుముందే సేకరించి నిల్వచేసిన తల్లిపాలు వందలాది మంది నవజాత శిశువుల ఆకలి తీర్చాయని సంతోష్ వివరించారు. ప్రస్తుతం నిలోఫర్‌లో పుట్టిన శిశువులకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ తల్లిపాలను ఏడాదిపాటు నిల్వ చేసేందుకు అవసరమైన ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. ముందుముందు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి, నిజామాబాద్, కాకినాడ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకూ తమ సేవలను విస్తరించడానికి సిద్ధమవుతున్నట్టు వివరించారు.
మదర్స్ మిల్క్ బ్యాంక్...
గోల్డెన్ అవర్..
పుట్టిన బిడ్డకు గంట వ్యవధిలో తల్లి పాలివ్వాలి. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. తల్లులకు పాలు రాకపోవటం, శిశువుల అనారోగ్యం, సిజేరియన్ తదితర కారణాలతో ఒక్కోసారి తల్లి, బిడ్డలను వేర్వేరుచోట్ల ఉంచాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలతో శిశువుల ఆకలి తీర్చాలి. కాని పేగు సంబంధ సమస్యతో పుట్టిన పిల్లల్లో 10 శాతంమంది బయటిపాలు పట్టడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు గురవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే తల్లిపాలతో వారి కడుపు నింపడమే మేలని డాక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. 2017 నుంచి ఇప్పటి వరకూ సుమారు 8,400 మంది తల్లులు 3000 లీటర్లకు పైగా పాలను పంచి దాతృత్వం చాటుకున్నారని చెప్పారు.
అమ్మలకు.. బామ్మల పాఠాలు
తల్లిపాల సేకరణతోపాటు మరికొన్ని సేవలకూ ఈ సంస్థ సిద్ధపడుతోంది. మొదటిసారిగా తల్లులైన కొంతమంది అవగాహన లేక బిడ్డల ఆకలి తీర్చలేకపోతున్నారు. అలాంటివారికి పెద్ద వయసు మహిళలు, బామ్మలతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. సుమారు 20 మంది బామ్మలు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతోపాటు కాబోయే తల్లుకు అవగాహన కల్పించేలా.. ఆన్‌లైన్ ద్వారా ‘ఆర్యజనని’ కార్యక్రమం నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు డాక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. వివరాలకు: ఫేస్‌బుక్ ఖాతా ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ (Dhaatri Mothers Milk Bank) పేజీ చూడవచ్చు.
ఈ అమ్మ మనసు వెన్న..
సుదేష్ణ...
ఈమె పేరు సుధేష్ణ. గుంటూరు జిల్లాలోని చిన్న గ్రామం వారిది. కన్నబిడ్డ బొజ్జ నిండాక చనుబాలు మిగిలిపోతున్నాయి. వాటిని వృథా చేసేందుకు ఆ తల్లి మనసు అంగీకరించలేదు. ఇంటర్నెట్‌లో వెతికితే హైదరాబాద్‌లో ఉన్న తల్లిపాల బ్యాంకు గురించిన వివరాలు కనిపించాయి. అయితే లాక్‌డౌన్ ఆంక్షలతో ఎటూ కదల్లేని పరిస్థితి. ఫోన్‌లో సంప్రదించి తల్లిపాలు అవసరమైన పిల్లల ఆకలి తీర్చడానికి తన సమ్మతి తెలిపారు. వైద్య పరీక్షల్లో పూర్తి ఆరోగ్యవంతురాలిననే ధ్రువీకరణపత్రం జతచేసి పంపారు. అట్నుంచి అంగీకారంతోపాటు.. పాలు నిల్వ చేసేందుకు ఫ్రీజర్‌ను పంపారు. అలా ఆమె సుమారు 20 లీటర్ల వరకూ పాలను సేకరించి పంపిన ఆమె ఎంతోమంది నవజాత శిశువుల ఆకలి తీర్చారు.