ఏపీలో కొవిడ్ మహమ్మారి బారినపడి మరో 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మరణించిన వారి సంఖ్య 13,807కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,461 పరీక్షలు నిర్వహించగా.. 1,321 కేసులు నిర్ధారణ అయ్యాయి.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 20,10,566 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 1,499 మంది బాధితులు కోలుకోవడం ద్వారా ఏపీ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,81,906కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 14,853 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,64,71,272 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి: