పల్లెప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పల్లెప్రగతి కార్యక్రమం అమలవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలను మారుస్తున్నామని పేర్కొన్నారు. పల్లెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్ 45 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను నియమించామని వెల్లడించారు.
"మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేశాం. కుల వృత్తులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాం. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నాం. ప్రణాళికబద్ధంగా గ్రామాలు అభివృద్ది చేస్తున్నాం. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే మా లక్ష్యం. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేశాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేస్తాం. వందశాతం వైకుంఠధామాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను చేస్తాం" అని సీఎం వివరించారు.
ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్