రాష్ట్రంలోని గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు జీవో 51 ప్రకారం రూ.8,500 చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీవో నేటికీ అమలు కావడం లేదని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 51, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న పల్లె నుంచి పట్నం వరకు పంచాయతీ పాదయాత్రను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్కు ఈ నెల 20న పాదయాత్ర చేరుకుంటుందన్నారు.
ఇవీ చూడండి: అమ్మే నా దగ్గరకి రావాలి.. నేను వెళ్లను : అమృత