ఎన్డీయే వంద రోజల పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు.. పలు విప్లవాత్మక నిర్ణయాలతో దేశ రక్షణ, భవితకు పాటుపడ్డామని కేంద్రమంత్రి ఆర్.కే.సింగ్ అన్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి చర్యలపై నివేదిక విడుదల చేశారు. గత 70 ఏళ్లలో సాధించలేని ప్రగతి తాము ఐదేళ్లలో చేసి చూపించామని అందుకే ప్రజలు తమను తిరిగి ఎన్నుకున్నారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగాయని జగన్ ప్రధానిని కలిసిన అంశంపై కేంద్రమంత్రి స్పందించారు. పెట్టుబడులకు విఘాతం కలిగించే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా సహేతుకం కాదని ఆర్.కే.సింగ్ స్పష్టం చేశారు. ఒప్పందాల్లో ఏవైనా అవకతవకలు జరిగాయని భావిస్తే.. ఆధారాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తానని.. అక్కడి పనులు పరిశీలించాకే దానిపై స్పందిస్తానని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు"