కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సమాచారం కోసం కేంద్రం నేరుగా రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు, నిత్యావసర వస్తువుల సరఫరా, అత్యవసర సేవల లభ్యత గురించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించరించనుంది. ఇందుకోసం కేంద్ర మంత్రులకు వివిధ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది.
నేరుగా సమాచారం తెప్పించుకొని, దాని ఆధారంగా వేగంగా స్పందించడానికి ప్రధాని మోదీ ఈ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 జిల్లాల బాధ్యతలను కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌కు, 16 జిల్లాల బాధ్యతలను హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డికి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతోపాటు, తమిళనాడులోని 10 జిల్లాల బాధ్యతలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను చూసుకోనున్నారు.
సంతోష్ గంగ్వార్‌కు అప్పగించిన జిల్లాలు
ఆదిలాబాద్, కుమురం భీం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు.
జి.కిషన్ రెడ్డికి అప్పగించిన జిల్లాలు
నల్గొండ, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, నారాయణపేట.
ఇవీ చూడండి: కరోనాకు మందు లేదు.. ఓ ఆయుధం ఉంది: కేసీఆర్