ETV Bharat / city

బల్దియా పోరు: ప్రచార సామగ్రి తయారీదారులకు తగ్గిన ఆదాయం.. - campaign material in ghmc elections

ఎన్నికలేవైనా.. ప్రచారంతోనే రాజకీయ పార్టీలు, పార్టీ శ్రేణులకు ఊపొస్తుంది. మెడలో పార్టీ కండువా, చేతిలో జెండా, తలపై టోపీతో ప్రచారానికి దిగారంటే.. కార్యకర్తలు, నాయకుల్లో తెలియని ఉత్సాహం వస్తుంది. ఏ పార్టీ నేతలు ప్రచారానికి వస్తున్నారో.. ఆ పార్టీ జెండాను చూస్తే ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం బల్దియా ఎన్నికల ప్రచారానికి వీటిని తయారు చేసే తీరిక లేక.. తయారీదారులు పాత స్టాకునే విక్రయిస్తున్నారు.

campaign material in ghmc elections 2020
బల్దియా పోరు ప్రచార సామగ్రి తయారీదారులకు తగ్గిన ఆదాయం
author img

By

Published : Nov 21, 2020, 1:35 PM IST

గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్​లో 74 లక్షల 4వేల 286 మంది ఓటర్లు ఉన్నారు. 150 డివిజన్లలో కార్యకర్తలు ప్రచారం చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఇక.. ప్రచారానికి కావాల్సిన సరంజామా..సామగ్రిని అంతా సిద్దం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల ప్రచారం అంటే హంగూ.. ఆర్భాటం తప్పనిసరి ఉంటుంది. నేతలు వస్తున్నారంటే.. వారి వెనక కార్యకర్తలు భారీగా తరలివస్తుంటారు. ఆయా పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తూ.. ఇంటింటికి తిరిగి ఓటు వేయమని అభ్యర్థిస్తుంటారు. వారు ఏ పార్టీకి చెందినవారో.. ఓటర్లు గుర్తించేందుకు మెడలో వారి పార్టీకీ చెందిన కండువా ధరించి ప్రచారం చేయడం ఆనవాయితీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేతలు ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన సామగ్రిని ఆర్డర్ ఇచ్చారు.

గత ఎన్నికల సామగ్రితోనే..

ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్​లతో పాటు, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెజస పార్టీలతో పాటు, గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ తమ పార్టీల జెండాలను, కండువాలను, టోపీలను, టీషర్ట్​లు, కీచైన్లు తయారు చేసే వారికి ఆర్డర్ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్​కు.. పోలింగ్ జరిగే సమయానికి తక్కువ సమయం ఉండటం వల్ల రాజకీయ పార్టీలకు కావాల్సిన ఆర్డర్​ను సరఫరా చేయలేకపోతున్నామని తయారీదారులు తెలిపారు. భారీ ఎత్తున ఆర్డర్ తయారు చేయాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. కాంగ్రెస్, భాజపా పార్టీలకు సంబంధించిన జెండాలు, కండువాలను గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తయారు చేసిన వాటినే విక్రయిస్తున్నామని చెబుతున్నారు.

తక్కువ సమయం..

జీహెచ్.ఎంసీ ఎన్నికల్లో నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఆ తర్వాత నుంచి అభ్యర్థుల ప్రచారం వేగం పుంజుకుంటుంది. 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ప్రచారానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉండటం వల్ల పార్టీలు కోరినంత ప్రచార సామాగ్రిని సరఫరా చేయలేకపోతున్నామని తయారీదారులు వెల్లడించారు.

కాస్త సమయముంటే.. ఆదాయం వచ్చేది..

ప్రచారానికి ఎక్కువ సమయం ఉన్నప్పుడు సిరిసిల్ల, భీమండి, మాలేగామ్, సూరత్ నుంచి ప్రచార సామగ్రికి సంబంధించిన మెటీరియల్ తెప్పించి తయారు చేస్తామని వెల్లడించారు. పార్టీల ప్రచార సామగ్రి తయారీ, విక్రయాలపై ఆధారపడి జీవించేవారిపై జీహెచ్.ఎంసీ ఎన్నికలు ప్రభావాన్ని చూపించాయని పేర్కొంటున్నారు. ఇంకాస్త సమయం ఉండి ఉంటే.. తమకు కూడా ఆదాయం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.