తెరాసతో ఎంఐఎం లోపాయకారి ఒప్పందం చేసుకుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురా వార్డులో భాజపా కార్యాలయాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం జంగంమెట్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నగరంలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ప్రశ్నించారు. పొరపాటున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ తెరాస గెలుస్తే... మజ్లిస్ ఆగడాలు మితిమీరే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రేటర్లో ఈసారి మేయర్ పీఠం భాజపాదేనని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.