శంకర్ ఫౌండేషన్లో ఉన్న 40 మంది మానసిక ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు హెచ్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో బెడ్స్, దుప్పట్లు, మాస్కులు, శానిటైజర్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలోని శంకర్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీదేవి సేవలను ఆయన కొనియాడారు.
విద్యార్థుల హస్త కళలను గురించి తెలుసుకున్నారు. నూతన సంవత్సరం కానుకగా విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇవి పంపిణీ చేసినందుకు హెచ్ ఫౌండేషన్ను ఆయన అభినందించారు.
ఇదీ చదవండి: నష్టాలొస్తున్నాయ్... సీటింగ్ సామర్థ్యం పెంచండి: చలన చిత్ర మండలి