Asaduddin Owaisi About KCR : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు మీద ఉన్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చేది తెలీదని చెప్పారు. తెరాస అంటే కేసీఆర్ ముఖం ఒక్కటేనని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇంతే చురుకుగా ఉంటూ.. ప్రజల్లో తిరగాలని సూచించారు.
Asaduddin Owaisi About CM KCR : "చంద్రశేఖర్ రావు మెుండి పట్టుదల కలిగిన వ్యక్తి. కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయకండి. ఒక మంచి విషయం ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు చురుకుగా ఉన్నారు. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇలాగే ఉంటారని ఆశిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వరకు ఇంతే చురుకుగా ఉండాలని కోరుకుంటున్నాం."
- అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత
- ప్రశ్న : ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా..?
లేదు. ఎప్పుడు వెళతారో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి మేము త్వరగా సిద్ధమవుతాం.
- ఇదీ చదవండి : CM KCR Yadadri Tour : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్..