విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ విపణుల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కాస్త తగ్గింది. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలకే పరిమితం అయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 95 పాయింట్ల లాభంతో 39వేల 230 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ 25 పాయింట్లు పెరిగి 11 వేల 690 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లో...
కోటక్ బ్యాంక్, టెక్ ఎమ్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫినాన్స్, యస్ బ్యాంక్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
టాటా మోటర్స్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, మారుతి, సన్ ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్ నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి... ముడిచమురు...
డాలరుతో పోల్చితే రూపాయి విలువ 7 పైసలు తగ్గి 68.79 వద్ద కొనసాగుతోంది.
బ్రెంట్ ముడి చమురు ధర 0.26 శాతం వృద్ధితో బ్యారెల్కు 64.52 డాలర్లుగా ఉంది