లాక్డౌన్ వేళ దేశంలో సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఈ నేరాలను ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్ ప్రొవైడర్ కే7 కంప్యూటింగ్ విశ్లేషించింది. డేటా ప్రకారం కేరళ ప్రథమ స్థానంలో ఉండగా పంజాబ్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సగటున 250 మంది..
చిన్న నగరాల్లో 10,000 మంది వినియోగదారుల్లో సగటున 250 మందిపై సైబర్ దాడులు జరిగాయని కే7 సంస్థ తెలిపింది. కేరళలోని కొట్టాయం (462), కన్నూర్ (437), కొల్లాం (236), కొచ్చిలో (147) అత్యధికంగా దాడులు జరిగాయని తెలిపింది. ఇలా 2,000 సైబర్ క్రైమ్స్‌తో దేశంలోనే అగ్రస్థానంలో కేరళ ఉందని వెల్లడించింది. ఈ జాబితాలో కపంజాబ్ (207), తమిళనాడు (184) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయని సంస్థ తెలిపింది.
కరోనా పేరుతో..!
2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల మధ్య వరకు జరిగిన దాడులను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశారు. కరోనా భయాలను ఆసరాగా తీసుకొని సంస్థలు, వ్యక్తులను సైబర్ మోసగాళ్లు దోచుకున్నారని వెల్లడించింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లే లక్ష్యంగా దాడులు చేసి వినియోగదారుల రహస్య సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలను యాక్సెస్ చేసి సైబర్దాడులుకు పాల్పడ్డారని నివేదించింది.
మాల్వేర్ లింక్‌లు పంపి..
'కొవిడ్-19 సమాచారానికి సంబంధించి నకిలీ యాప్‌లు సృష్టించి.. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ట్రెజరీ విభాగం పేరుతో మాల్వేర్ లింక్‌లు పంపిస్తారు. కరోనాపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజల్లో భయాన్ని కలిగిస్తారు. ఇలా వినియోగదారుల సున్నిత డేటాను సేకరించి దాడులు చేస్తున్నారు. విద్యావంతులే అధికంగా ఈ దాడులకు గురయ్యారు.' అని కే7 తెలిపింది.
ఇదీ చూడండి: ఆ నిధిపై కాంగ్రెస్ ట్వీట్- సోనియాపై కేస్