దేశ తయారీ రంగ కార్యకలాపాలు వరుసగా మూడో నెలలోనూ పుంజుకున్నాయి. అమ్మకాల్లో వృద్ధికి అనుగుణంగా.. 13 ఏళ్లలోనే కంపెనీలు అత్యధిక ఉత్పత్తిని పెంచినట్లు ఓ నివేదిక తెలిపింది.
ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక ప్రకారం తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్‌లో 58.9కి పెరిగింది. సెప్టెంబర్‌లో ఇది 56.8 వద్ద ఉంది. ఇది దశాబ్ధకాలంలోనే అత్యధిక వృద్ధి అని ఐహెచ్ఎస్ మార్కిట్ పేర్కొంది.
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో.. తయారీ రంగ పీఎంఐ 32 నెలల వరుస వృద్ధి తర్వాత.. ఏప్రిల్‌లో భారీగా క్షీణించింది. అ తర్వాత అన్‌లాక్‌తో తిరిగి వృద్ధి సాధిస్తున్నట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ వివరించింది.
ఇదీ చూడండి:వైద్య ఖర్చులకు ప్రభుత్వ సాయం అంతంతే!