ETV Bharat / business

మరిన్ని ఉద్దీపనలతోనే ఆర్థిక పునరుద్ధరణ సాధ్యం! - భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రయత్నాలు చేపట్టింది. అయితే వాటితో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు పెద్దగా కనిపించడం లేదు. ఇందుకు కారణాలేమిటి? ప్రగతి రథం త్వరగా వేగం పుంజుకోవాలంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలను విశ్లేషించారు ఆర్థిక నిపుణుడు, బెంగళూరు బేస్​ యూనివర్సిటీ ఉపకులపతి ఎన్​.ఆర్​.భానుమూర్తి.

Indian economy growth
ఆర్థిక వృద్ధికి కావాల్సిన ఉద్దీపనలు ఏమిటి
author img

By

Published : Aug 17, 2020, 5:58 PM IST

Updated : Aug 17, 2020, 6:12 PM IST

కొవిడ్‌ మహమ్మారిపై గత ఐదు నెలలుగా నిర్విరామ పోరాటం సాగుతోంది. అయినా... గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంపూర్ణ లాక్​డౌన్​తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ స్థాయిలో అన్‌లాక్‌ ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ.. స్థానికంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఉండటం... కీలకమైన రంగాల్లో కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తోంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పునరురద్ధరణకు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సమయం పట్టేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రిజర్వు బ్యాంక్ అంచనాలు ఇలా..

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో.. దేశ వృద్ధి రేటు ఈ ఏడాది ప్రతికూలంగానే ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం విషయంలోనూ ఇలాంటి సంకేతాలే ఇచ్చింది.

క్లిష్ట పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కేందుకు.. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఇందులో ఆర్​బీఐ కూడా జోక్యం చేసుకోవాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది.

ఇప్పటి వరకు తీసుకున్న చర్యల సంగతేంటి?

ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విధాన పరంగా... ఆర్​బీఐతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. ఇందులో ప్రధాన భాగం ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో పొందుపరిచారు. ఈ ప్యాకేజీ విలువ రూ.21 లక్షల కోట్లు. ఇది జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.

ఈ ప్యాకేజీకి సంబంధించి ఆర్థికవేత్తల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో సంస్కరణలతో పాటు ఆర్థికపరమైన చర్యలున్నందున.. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం జీడీపీలో 1.3 శాతం మాత్రమే ఉంటుందని వారంటున్నారు.

ఇందులో ఉపాధి హామీకి నిధులు పెంచటం, వలస కార్మికులకు ఉచితంగా బియ్యం అందించటం, పేదలకు ఆర్థిక సహాయం లాంటివి ప్రధానంగా ఉన్నాయి. అయితే ఈ ప్యాకేజీని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిందిగానే పరిగణించాలని ఆర్థికవేత్తలు అంటున్నారు.

తేడా గుర్తించాలి..

ఆర్థిక సహాయం, ఉద్దీపన మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆత్మ నిర్భర్ ప్యాకేజీని ఉద్దీపన ప్యాకేజీగా పేర్కొనడానికి బదులు విస్తృత విధాన సహాయంగా (బ్రాడ్‌ బేస్‌డ్‌ పాలసీ సపోర్ట్‌ ప్యాకేజీ) పరిగణించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎంఎస్‌ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీలకు క్రెడిట్‌ గ్యారంటీతో పాటు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పథకంలో వ్యవసాయ రుణ సదుపాయాలను ఉద్దీపనగా భావించలేమంటున్నారు ఆర్థికవేత్తలు. ఎందుకంటే అలాంటి రుణాలు తీసుకున్నవారు.. వాటిని చెల్లించకపోతే మాత్రమే ప్రభుత్వంపై భారం పడుతుందని చెబుతున్నారు.

అదనపు సహాయం..

2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. సంయుక్తంగా బడ్జెట్‌ లోటు జీడీపీలో 6.3 శాతం. అయితే కొవిడ్​తో ప్రభుత్వ ఆదాయాలు తగ్గిపోవటం వల్ల బడ్జెట్‌ లోటు 6.3 శాతానికే పరిమితం చేయాలంటే తగ్గిన ఆదాయన్ని భర్తీ చేసేందుకు.. అంతే మొత్తంలో రుణాలు అవసరమవుతాయి. దీనిని మాత్రమే అదనపు ఆర్థిక సహాయంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

ఆత్మ నిర్భర్ భారత్​ ప్యాకేజీ కంటే ముందే రూ.4.2 లక్షల కోట్ల(జీడీపీలో 2.1శాతం) మేర అదనపు రుణాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఆదనంగా 2 శాతం(1.5 శాతం వరకు నిబంధనలు వర్తిస్తాయి) రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అనుమతిచ్చింది. దీనితో పాటు 1.3 శాతం ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీని కలిపితే.. జీడీపీలో 11.5 శాతం మొత్తంగా అర్థిక సహాయం అవుతుంది. అయితే ఇందులో కొన్నింటికి నిబంధనలు ఉన్నందున.. కనీసం వీటినైనా ఆర్థిక సహాయంగా పరిగణించవచ్చు.

ఆర్​బీఐ అండ..

అంతిమంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మార్కెట్‌ నుంచి ఎంత మేర రుణం తీసుకోగలిగిందన్నదే కీలకం. తాజా గణాంకాల ప్రకారం, ఆర్​బీఐ ప్రభుత్వానికి మంచి స్థాయిలో సహాయసహాకారాలు అందిస్తోన్న నేపథ్యంలో.. ప్రభుత్వ రుణ సేకరణ కార్యక్రమం సాఫీగా సాగుతోంది.

ద్రవ్యపరపతి పరంగా 8 శాతం జీడీపీ వృద్ధి రేటుకు సరిపోయే విధంగా రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు లిక్విడిటీకి సంబంధించి చర్యలు తీసుకుంది.

ఆర్​బీఐ రెపో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ అవ్వటం ఇటీవల చాలా మెరుగుపడింది. రుణాలపై ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఒత్తిడిలో ఉన్న పలు రుణాలను పునర్ వ్యవస్థీకరించే విధంగా ఇటీవల తీసుకున్న చర్య.. రుణ ప్రవాహం మెరుగుపరిచేందుకు బ్యాంకింగ్‌ రంగానికి దోహదపడుతుంది.

కొన్ని ప్రముఖ సంస్థల అంచనాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఈ చర్యలు చాలవు. అంతేకాకుండా ఇప్పటి వరకు తీసుకున్న చర్చల్లో కొన్ని మధ్యస్థ, దీర్ఘకాలానికి సరిపోయేవి మాత్రమే ఉన్నాయి. ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు సహాయపడినప్పటికీ.. సరఫరా వైపు పరిస్థితి ఇంకా బలహీనంగానే ఉన్నట్లు సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. దీనితో సరఫరా వ్యవస్థను యథాస్థితికి తీసుకురావటానికి ఎక్కువ సమయం పడుతుందని కొంత మంది ఆర్థిక వేత్తలు అంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక, ద్రవ్యపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెంచుతాయి. అయితే ధరలు పెరగకుండా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టటం ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న?

సరఫరాను పునరుద్ధరించాలి

  • డిమాండ్​ను మరింత పెంచుతూ.. ప్రస్తుతం సరఫరా వైపు సమస్యలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి.
  • కొన్ని సంవత్సరాల నుంచి సమస్యల్లో ఉన్న బ్యాంకింగ్, నిర్మాణ, వాణిజ్య, రవాణా, ఆరోగ్య, ఎంఎస్‌ఎంఈ లాంటి కీలక రంగాల్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. జీఎస్‌టీ, ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రాష్ట్రాలకు అందించే మొత్తాన్ని బదిలీ చేయాలి. ఇలాంటివి కొన్ని డిమాండ్‌ను పెంచుతాయి.
  • ప్రస్తుతం కొవిడ్‌ వల్ల అమలు చేయటంలో సవాళ్లు ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ చర్యలు(ముఖ్యంగా రంగాల వారీగా చర్యలు) తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యమైనది.
  • ఈ చర్యల వల్ల ఆర్థికంగా భారం పడనున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆర్థిక లోటును భరించాల్సిన అవసరం ఉంది.
  • వృద్ధి, ఉద్యోగిత పై ప్రభావం చూపే రంగాలతో పాటు అవసరం ఉన్న రంగాలకు రుణ వితరణపై ఆర్​బీఐ దృష్టి సారించాలి.
  • కొవిడ్‌- 19కు సంబంధించి ఒత్తిడి ఆస్తులపై రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ బ్లూ ప్రింట్‌ కోసం నిపుణులు కమిటీ ఏర్పాటు చేయాలన్న ఇటీవలి ఆర్​బీఐ నిర్ణయం.. బ్యాంకింగ్‌ రంగంలో సరఫరా వైపు ఉన్న సమస్యలను పరిష్కరించగలదు.
    N R Bhanumurthy
    రచయిత: ఎన్‌.ఆర్‌. భానుమూర్తి, ఉపకులపతి-బేస్‌ యూనివర్సిటీ, బెంగళూరు

గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలన్ని రచయిత వ్యక్తిగతం మాత్రమే.

Last Updated : Aug 17, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.