ETV Bharat / business

ప్యాకేజ్ 4.0: ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట

కేంద్ర ప్రభుత్వ భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఎనిమిది రంగాలకు కేటాయించిన ఉద్దీపన వివరాలను వెల్లడించారు నిర్మలా సీతారామన్. బొగ్గు, అణు, రక్షణ, విద్యుత్ రంగాలతో పాటు అంతరిక్షానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపగ్రహ తయారీలో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

nirmala
నిర్మల
author img

By

Published : May 16, 2020, 6:33 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదే ఉద్దేశంతో కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్యాకేజీ నాలుగో రోజు ప్రకటనలో భాగంగా వృద్ధి అవకాశాలు మెండుగా ఉండే నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ సంస్కరణలు వివిధ రంగాల్లో గొప్ప మార్పు తీసుకొస్తాయని స్పష్టం చేశారు.

మొత్తం ఎనిమిది రంగాలకు సంబంధించి ఉద్దీపనలు ప్రకటించారు నిర్మల. బొగ్గు, పౌర విమానయానం, అణు, రక్షణ, విద్యుత్ రంగాలతో పాటు సామాజిక మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులకు పెద్ద పీట వేసేలా ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వెలువరించారు.

పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి

'భారత్‌లో తయారీ'తో ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించే విధంగా నూతన సంస్కరణలు రూపొందిస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపాధి పెంచేందుకు ఈ నూతన సంస్కరణలు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా ర్యాంకు​లు ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

  • పారిశ్రామిక క్లస్టర్ల నవీనీకరణ కోసం రాష్ట్రాల ద్వారా పథకం అమలు
  • పెట్టుబడులకు ప్రోత్సహం కల్పించే విధంగా పారిశ్రామిక భూబ్యాంకు ఏర్పాటు
  • పారిశ్రామిక సమాచార వ్యవస్థ(ఐఐఎస్)లో జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా అందుబాటులో భూసమాచారం
  • 5 లక్షల హెక్టార్లలోని 3376 పారిశ్రామిక పార్కుల సమాచారం సిద్ధం
  • పారిశ్రామిక పార్కులకు 2020-21 నుంచి ర్యాంకింగ్

ప్రైవేటుకు బొగ్గు

బొగ్గు రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గించేలా చర్యలు చేపట్టారు నిర్మల. పోటీతత్వం పెంచేలా ఈ రంగంలో ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఖనిజ రంగంలోనూ విధానపర సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు నిర్మల. క్యాప్టివ్ మైన్లు, నాన్​ క్యాప్టివ్​ మైన్ల మధ్య వ్యత్యాసాన్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. తద్వారా గనుల లీజు బదిలీ సహా మిగులు ఖనిజం అమ్మకానికి వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. వివిధ ఖనిజాలకు గనుల శాఖ మినరల్ ఇండెక్స్​ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

2023-24 నాటికి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే విధంగా కోల్​ ఇండియా లిమిటెడ్​ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.50 వేల కోట్ల పెట్టుబడి అందించనున్నట్లు స్పష్టం చేశారు. కొత్త బొగ్గు గనులను కనుగొనేందుకు నిరంతరం ప్రయత్నించనున్నట్లు చెప్పారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

  • పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా బొగ్గు సరఫరా
  • బొగ్గును వాయువుగా మార్చేందుకు నూతన సాంకేతికత
  • బొగ్గు ఉత్పత్తికి అందుబాటులోకి కొత్తగా 500 బ్లాకులు
  • బాక్సైట్‌- బొగ్గు గనులు కలిపి వేలం వేసేలా కొత్త విధానం
  • గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు
  • మైనింగ్‌ లీజులపై విధించే స్టాంప్ డ్యూటీల హేతుబద్ధీకరణ
  • పాక్షికంగా వినియోగించుకున్న గనులను ఇతరులకు బదిలీ చేసేందుకు వెసులుబాట్లు

రక్షణ

మేక్​ ఇన్​ ఇండియా కార్యక్రమం ద్వారా రక్షణ ఉత్పత్తుల్లో భారత్ స్వావలంబంన సాధిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సైన్యానికి నాణ్యమైన ఆయుధాల కోసం దిగుమతులు అవసరమని స్పష్టం చేశారు. అవసరమైన దిగుమతులు చేసుకుంటూనే.. మేకిన్ ఇండియా ద్వారా సొంతంగా తయారీ చేపట్టనున్నట్లు తెలిపారు. రక్షణ తయారీ రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49శాతం నుంచి 74శాతానికి పెంచారు. ఆయుధాలు, విడి భాగాల తయారీకి బడ్జెట్​లోనే ప్రత్యేక కేటాయింపులు జరపనున్నట్లు స్పష్టం చేశారు.

  • ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేట్‌ బాడీలుగా మార్పు
  • ఆయుధాల ఉత్పత్తి, పరిశోధనలో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల ద్వారా పారదర్శక నిర్ణయాలు
  • ఆయుధాల సేకరణ, తయారీదారుల ఎంపికలో జాప్యం నివారణ

పౌర విమానయానం

విమానయాన రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నిర్మలా సీతారామన్. భారతీయ ఏరోస్పేస్ రూట్లలో హేతుబద్ధీకరణ జరుగుతున్నట్లు వెల్లడించారు. హేతుబద్ధీకరణతో ప్రయాణ సమయంతో పాటు ఇంధనం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. ఫలితంగా వినియోగదారులపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

విమానయానంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి ఎయిర్​పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు నిర్మల. ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మూడు విమానాశ్రయాలను పీపీపీ పద్ధతికి కోసం ఎంపిక చేసిందని అన్నారు. మరో 12 విమానాశ్రయాల్లో రూ.12 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

  • విమానాశ్రయాల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రూ.2,300 కోట్లు
  • పీపీపీ భాగస్వామ్యంతో మరో 6 ఎయిర్‌పోర్టులకు వేలం
  • 12 నూతన ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి నిర్ణయం
  • గగనతల ఉపయోగంపై ఉన్న పరిమితుల సడలింపు
  • ఫలితంగా సంవత్సరానికి రూ. వెయ్యి కోట్ల మేర ప్రయోజనం

మరమ్మతుల హబ్​గా భారత్

ఎయిర్​క్రాఫ్ట్ నిర్వహణ, మరమ్మతుల విషయంలో భారత్​ను ప్రపంచస్థాయి హబ్​గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఇప్పటివరకు ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న మరమ్మతులు.. ఎంఆర్​ఓల ఏర్పాటుతో స్వదేశంలోనే నిర్వహించవచ్చని స్పష్టం చేశారు.

విమాన విడిభాగాల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్​ను మూడేళ్లలో రూ.800 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు.

విద్యుత్ రంగం

విద్యుత్‌ రంగంలో స్థిరత్వం కోసం నూతన సంస్కరణలు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు నిర్మల. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటీకరించనున్నట్లు తెలిపారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నష్టాల ప్రభావం వినియోగదారులపై పడకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ఈ సంస్కరణలు ఉపకరిస్తాయని తెలిపారు. నూతన సంస్కరణలతో విద్యుత్‌ సరఫరాలో నాణ్యత, జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సామాజిక మౌలిక వసతులు

సామాజిక మౌలిక వసతుల కల్పనకు నూతన విధానం రూపొందించారు ఆర్థికమంత్రి. సాంఘీక మౌలిక సదుపాయాల్లో ప్రైవేటు పెట్టుబడులకు పెద్ద పీట వేసేలా పలు నిర్ణయాలు వెలువరించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఆస్పత్రులు, విద్యాసంస్థల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వయబిలిటీ గ్యాప్ ఫండ్​ కింద రూ. 8100 కోట్ల నిధి ప్రకటించారు.

అంతరిక్షం

అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడానికి పలు చర్యలు ప్రకటించారు ఆర్థికమంత్రి. ఉపగ్రహ తయారీ, ప్రయోగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.

  • ప్రైవేటు సంస్థలు ఇస్రో సౌకర్యాలు ఉపయోగించుకునే అవకాశం
  • భవిష్యత్తులో జరిగే అంతరిక్ష ప్రయాణాలు సహా ఇతర కార్యకలాపాల్లో ప్రైవేటు రంగానికి అనుమతి
  • రిమోట్ సెన్సింగ్ సమాచారం అందించడానికి లిబరల్ జియో స్పేషియల్ డేటా విధానం

అణు

అణు విద్యుత్ రంగంలోనూ ప్రైవేటుకు ప్రోత్సాహం అందించారు ఆర్థిక మంత్రి నిర్మల. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రీసెర్చి రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూరగాయలు, ఉల్లి వంటి ఉత్పత్తుల నిల్వకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రూపొందించేందుకు ప్రోత్సాహం అందించనున్నట్లు స్పష్టం చేశారు.

  • టెక్నాలజీ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రోత్సాహం
  • ఉల్లి, టమాటా, ఆలుగడ్డలు నిల్వ సామర్థ్యాన్ని పెంచే సాంకేతికాభివృద్ధికి ప్రోత్సాహం
  • నిల్వ సామర్థ్యం పెంచే ఇర్రేడియేషన్‌ సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.500 కోట్లు
  • ఈ రంగంలో కృషిచేస్తున్న యువత, స్టార్టప్‌లకు మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.