కరోనా సంక్షోభం కారణంగా అమెరికా వృద్ధి రేటు భారీగా క్షీణించింది. తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 5శాతం తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రస్తుత త్రైమాసికంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
జనవరి- మార్చి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి, వస్తు సేవల ఉత్పత్తి మొత్తం క్షీణించినట్లు ఆ దేశ వాణిజ్యశాఖ వెల్లడించింది. అయితే ఈ విషయంపై ముందే అంచనా వేసిన దానిలో ఎటువంటి మార్పు కనిపించలేదని నివేదించింది.
2008 4వ త్రైమాసికంలో తగ్గిన 8.4 శాతం వృద్ధి రేటు తర్వాత ఇదే అత్యల్ప క్షీణత అని పేర్కొంది వాణిజ్యశాఖ. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి మధ్యలో ప్రారంభమైన షట్డౌన్ కారణంగా మొదటి త్రైమాసికంలో ఈ క్షీణత ఏర్పడినట్లు అభిప్రాయపడింది.
ఇదీ చూడండి:తమిళనాడులో ఒక్కరోజులో 3,509 కరోనా కేసులు